జైనూర్ ఘటనను ఖండిస్తూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ శనివారం రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు జాగ్రత్తగా జిల్లాలకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. కేవలం మహారాష్ట్రకు బస్సులను నడిపిస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌కు వస్తున్న ప్రయాణికులు విషయం తెలుసుకొని తిరిగి వెళ్లిపోతున్నారు.