స్క్రాప్ దుకాణాల యజమానులు జాగ్రత్తగా వ్యవహరించాలని డిఎస్పి జీవన్‌రెడ్డి సూచించారు. దొంగ వస్తువులు కొంటె స్క్రాప్ దుకాణాల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాపర్ వైర్లు, సబ్ మెర్సిబుల్ మోటార్లు, వాహనాలు, వాటి విడిభాగాలు కొనే ముందు యజమానులవా కావా అని సరి చూసుకోవాలన్నారు. దొంగ వస్తువులు కలిగి ఉన్నా, కొన్నా చట్ట ప్రకారం నేరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశామని చెప్పారు.