ఆదిలాబాద్ రూరల్ మండలం చందాలోని రాజన్ షా వలి దర్గా ఉర్సు మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని షాహి సందల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లోని జామా మజీద్ నుంచి ప్రత్యేక చాదర్‌తో ర్యాలీ ప్రారంభమై, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా కవ్వాలి పాటలతో పాటు ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.