ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో రూ. 2, 200 విలువైన మూడు లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాజుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.