ఆదిలాబాద్: టిపిసిసి ఉపాధ్యక్షురాలిగా సుగుణక్క

56చూసినవారు
ఆదిలాబాద్: టిపిసిసి ఉపాధ్యక్షురాలిగా సుగుణక్క
టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 'సంవిధాన్ బచావో ప్రోగ్రామ్' రాష్ట్ర కమిటీలో సభ్యురాలిగా చోటు కల్పించిన అధిష్టానం, టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమించడం సంతోషంగా ఉందని సుగుణక్క తెలిపారు. తనను నియమించిన కాంగ్రెస్ అధిష్టానానికి సుగుణక్క కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్