బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు మానుకోవాలని రైతు సంఘం నాయకుడు దేవిదాస్ అన్నారు. ఈనెల 9న వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఆదిలాబాద్ పట్టణంలో కార్మిక ప్రజా సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగిస్తూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.