కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్స్ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ ఎంఏ గౌస్ అన్నారు. వక్స్ బిల్లు అమోదాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ లోని ఖిజ్ర మసీదు ఎదుట ఆందోళన చేపట్టారు. వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ చేతికి నల్ల బ్యాడ్జిలను ధరించి కేంద్రం తీరును ఎండగట్టారు. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా కేంద్రం వర్ఫ్ ఎమెండ్మెంట్ బిల్లును ఆమోదించిందని ఆరోపించారు.