ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంతో మున్సిపల్ పరిధిలోని ట్రాఫిక్ సమస్యలపై గురువారం చర్చించారు. రోడ్డుకి ఇరువైపులా తోపుడు బండ్లు పెట్టి విక్రయాలు జరపడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందరితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.