ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం గూడలో మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసులు పోస్ట్‌కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా తపాలా శాఖ కార్యాలయం వద్ద మూకుమ్మడిగా పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు. ముందుగా పోస్ట్ బాక్స్ కు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌తో పాటు తదితరులకు ఉత్తరాలను పంపారు.