భోరజ్ మండల సరిహద్దులోని పెన్‌గంగ వద్ద చించుఘాట్‌కి చెందిన ఆదివాసులు ఐదు గోత్రాల వంశ పెద్ద దేవుడు (బడాదేవ్) గంగ స్నానం శనివారం ఉదయం చేశారు. నది వద్ద ఆదివాసి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ మేరకు కుమ్ర రాజు పటేల్ మాట్లాడుతూ ఆదివాసి సంప్రదాయంలో పెద్ద దేవుడు పండుగ ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఇప్పపువ్వుతో చేసిన మహా ప్రసాదంగా అందజేస్తామన్నారు.