ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు విడిచిన వారికి సనాతన హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నివాళులర్పించారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న కార్గిల్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, రవీందర్, సూర్యకాంత్ ఉన్నారు.