ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో టీఎస్ యుటిఎఫ్ 6వ జిల్లా మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య హాజరై మాట్లాడారు. దేశ అక్షరాస్యత మెరుగుపడడం కాదని వందశాతం విద్యావంతులు అయినప్పుడే దేశ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ సమస్యల సాధనకు ఐక్య ఉద్యమించాలని పిలుపునిచ్చారు.