ఆదిలాబాద్: ద్విచక్ర వాహనం దొంగలు అరెస్ట్

75చూసినవారు
ఆదిలాబాద్: ద్విచక్ర వాహనం దొంగలు అరెస్ట్
ఈనెల 18న ఆదిలాబాద్ మెట్రో ఆటోమొబైల్స్ ఎదుట పార్కింగ్ చేసిన బైక్ దొంగతనం కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను సీఐ కరుణాకర్ వెల్లడించారు. బుధవారం స్ధానిక పంజాబ్ చౌక్ వద్ద ఎస్సై విష్ణుప్రకాష్ వాహన తనిఖీలు చేస్తుండగా అర్లీ(టీ)కు చెందిన దశరథ్, అనిల్ అనే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. బైక్ స్వాదినం చేసుకొని, రిమాండ్ కు తరలించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్