ఆదిలాబాద్: భక్తిశ్రద్ధలతో వటసావిత్రి వ్రతం

56చూసినవారు
సౌభాగ్యం కోసం మహిళలు వట సావిత్రి వ్రతాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన శ్రీ గోపాలకృష్ణ మఠంలోని మర్రిచెట్ల వద్ద తెల్లవారుజాము నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వటసావిత్రి వ్రతమహాత్యాన్ని వివరించారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కలకాలం సిరి సంపదలు, పాడి పంటలు వృద్ధి చెందుతాయని మహిళలు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్