ఆదిలాబాద్: భక్తిశ్రద్ధలతో విషు మహోత్సవం పూజ

75చూసినవారు
ఆదిలాబాద్ లోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో విషు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. సూర్యుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించే రోజున విషు మహోత్సవం చేపడతారు. విషు మహోత్సవం పూజ కార్యక్రమాల్లో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు సంతోశ్ శర్మ, వేద మంత్రోచ్ఛారణల నడుమ మెట్లపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్