అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను అవుట్ సోర్సింగ్ జేఏసీ సభ్యులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడినప్పటికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు