ఆదిలాబాద్: రైతులకు అండగా పార్టీ తరపున పోరాటాలు చేస్తాం

75చూసినవారు
రైతుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతాంగం పట్ల ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. రైతులు అమ్మిన జొన్న పంట నగదును విడుదల చేయడంతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాలన్నారు. లేనిపక్షంలో రైతులకు అండగా పార్టీ తరపున పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్