జమీయత్ ఉల్మాయే హింద్ సంఘం సమావేశాన్ని మంగళవారం ఆదిలాబాద్ కార్యాలయంలో నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు హఫీజ్ అబాబుకర్ మాట్లాడారు. మైనార్టీల అభ్యున్నతితో పాటు సామాజిక కార్యాక్రమాలను మరింత విస్తృతం చేయడానికి సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. అనంతరం సంఘం సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 20 వేల సభ్యత్వ నమోదు లక్ష్యం ఉందని తెలిపారు.