పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ గోపి కిషన్ సూచించారు. ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకొని ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శునకాలకు రేబిస్ టీకాలను వైద్య సిబ్బంది వేశారు. పెంపుడు జంతువుల నుంచి వ్యాధులు సోకకుండా సకాలంలో టీకాలు వేయిస్తూ ఉండాలన్నారు. వైద్యులు గజానన్, ధూద్ రాం రాథోడ్, పద్మ, కాజీ పాషా, తదితరులున్నారు.