ఆదిలాబాద్: క్షయ పరీక్షల కోసం ఎక్స్‌రే మిషన్ అందజేత

54చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాలో నిక్షయ్ క్యాంప్ విస్తృతంగా కొనసాగుతుందని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నెల రోజుల పాటు నిక్షయ్ క్యాంప్ కోసం సుశోధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్షయ పరీక్షల కోసం ఎక్స్‌రే మిషన్‌ను గురువారం సంస్థ సభ్యులు అందజేశారు. ఈ మిషన్‌తో ఎక్కడైనా పరీక్షలు చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి సుమలత సిబ్బంది తిరుపతి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్