ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఖానాపూర్ నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు స్పాన్సర్గా మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జహీర్ రంజాని వ్యవహరించారు. ఈ మేరకు కేకేఆర్, గాంధీ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. క్రికెట్ క్రీడకు దేశంలో విశేష ఆదరణ ఉందని, యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.