ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తిపై నుంచి వెళ్లడంతోనే దుర్మరణం చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బస్ డ్రైవర్ పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. కాగా మృతి చెందిన వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.