అంగరంగ వైభవంగా మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

56చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేపట్టారు. ముందుగా డప్పు చప్పుల్ల నడుమ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. భారి ఎత్తున తరలివచ్చిన భక్తులతో సందడిగా మారింది. మహిళలు మంగళ హారతులతో శోభయాత్రలో పాల్గొనగా పోతరాజు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర అనంతరం అమ్మవారికి సాముహిక నైవేద్యం సమర్పించి, పూజలు చేశారు.