ప్రభుత్వ ఆసుపత్రుల్లో యోగా శిక్షకుల నియామకానికి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. వీటిని ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఆయుష్ కమిషనర్ ప్రశాంతి వెల్లడించారు. ఒక్కో తరగతి గంటసేపు ఉంటుందని, ఒక్కో తరగతికి రూ. 250 చొప్పున చెల్లిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు ఈనెల 24న ఆదిలాబాద్ లోని ఆయుష్ ఆసుపత్రిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.