ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ శనివారం ప్రకటనలో కోరారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడుల్లో విద్యార్థుల ప్రవేశాల కొరకు, ఆయా బ్యాంకుల్లో రైతులకు రుణాలు పొందేందుకు సర్టిఫికెట్లు అవసరమన్నారు. దీంతో మండల తహసిల్దార్లు, అధికారులు స్పందించి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు.