ఆసిఫాబాద్: పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలి

69చూసినవారు
ఆసిఫాబాద్: పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలి
నూతనంగా అమలుపరుస్తున్న పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలనీ కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. నూతన పోల్ టాక్స్ విధానంతో కేబుల్ ఆపరేటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. సంబంధిత అధికారులు వారికి న్యాయం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్, సాజిద్, అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్