కొమరంభీం ప్రాజెక్టుకు నిర్మించిన కాలువలు మరమ్మత్తులు లేక చివరి ఎకరం వరకు నీరు అందడం లేదని, దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ గురువారం అన్నారు. 14 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సిన ప్రాజెక్టులో ప్రస్తుతం 2 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని, మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, దీన్ని పరిష్కరించాలని కోరారు.