విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తూ చదువుల్లో రాణించాలని మహిళ సాధికారత జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద అన్నారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా బుధవారం బేల మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం సిబ్బంది సంఘమిత్ర, లావణ్య, ఎస్‌వో నవీన్, తదితరులున్నారు.