లింగ వివక్షత, లింగ సమానత్వం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలని సఖి కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం కార్యక్రమంలో భాగంగా గురువారం భీంపూర్, ఆదిలాబాద్, మావల కేజీబీవీ లలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్, చట్టాలు, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ యశోద, తదితరులున్నారు.