సఖి కేంద్రంకు వచ్చిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆ కేంద్రం సోషల్ కౌన్సిలర్ లావణ్య, లీగల్ కౌన్సిలర్ సంఘమిత్ర అన్నారు. బుదవారం ఆదిలాబాద్ లో సరస్వతినగర్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు సఖి కేంద్రం సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం ద్వారా కల్పిస్తున్న ఐదు రకాల సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలతో హెల్ప్ లైన్ నంబర్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు.