జైనూర్ లో ఆదివాసి మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని కోరుతూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆదివాసుల బంద్ నేపథ్యంలో వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు