కాంగ్రెస్ నేత తీరుపై భగ్గుమన్న మున్నూరు కాపులు

589చూసినవారు
ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘంలో రాజకీయ చిచ్చు రాజుకుంది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సంఘం సభ్యుల్లో విభేదాలు మొదలయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి తమ సామాజికవర్గ నాయకురాలు గండ్రత్ సుజాతపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంఘం సభ్యులు కాంగ్రెస్ నేతలపై మండి పడుతున్నారు. బుధవారం సంఘ భవనంలో సమావేశమైన సభ్యులు ఆదిలాబాద్ లో నిరసనకు దిగారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్