ఆదిలాబాద్‌: ఈనెల 17న భావన సంక్షేమ కార్యాలయం ముట్టడి

50చూసినవారు
ఆదిలాబాద్‌లోని కార్మికుల అడ్డా భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకుడు రాజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు వల్ల కార్మికులకు అనేక లాభాలు ఉన్నాయన్నారు. సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 17న హైదరాబాద్‌ భవన సంక్షేమ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్