జైనూర్ లో ఆదివాసి మహిళపై అత్యాచారయత్నం ఘటనను ఖండిస్తూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తలపెట్టిన బంద్ నేపథ్యంలో నేతలు శనివారం ఆదిలాబాద్ పట్టణంలో ఆదివాసుల సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెరిచి ఉన్న షాపులను బంద్ చేయించారు. ఈ నేపథ్యంలో డిఎస్పి జీవన్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలతో ఎప్పటికప్పుడు బంద్ ను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.