ఆదిలాబాద్: కాంగ్రెస్ లో చేరిన బీజేపి నాయకులు

60చూసినవారు
ఆదిలాబాద్: కాంగ్రెస్ లో చేరిన బీజేపి నాయకులు
బీజేపీ నాయకులు మేకల అశోక్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గురువారం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో ప్రజాసేవా భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కలిసి పని చేద్దామని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్