జైనథ్ మండల కేంద్రంలో రుణమాఫీ కోసం రైతులు చేపట్టిన ఆందోళనకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో కలిసి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఆంక్షలు లేకుండా వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేపట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేసేంతవరకు వారి పక్షాన పోరాడుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.