గుడిహత్నూర్ మండలం మల్కాపుర్ గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఆడే గజేందర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.