తల్లిపాలే బిడ్డకు అమృతం అని, శిశు జన్మించగానే ముర్రు పాలు పట్టిస్తే బిడ్డల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఎస్ఎన్సియు విభాగాధిపతి డాక్టర్ అనంతరాం పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలు గురువారం ఆదిలాబాద్ రిమ్స్ లోని ఎస్ఎన్సీయూలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లి పాల వల్ల ప్రయోజనాలను తల్లులకు వివరించి పాలు పట్టే విధానం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారి మృదుల్, శ్రీజ పాల్గొన్నారు.