రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు కృషి చేయాలని మాజీమంత్రి జోగురామన్నపేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. అమలుకు సాధ్యం కానీ, మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.