రాష్ట్ర పంచాయితి రాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి వారం ప్రజావాణి యధాతధంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.