ఆదిలాబాద్: పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు

60చూసినవారు
గ్రూప్‌ 2 పరీక్ష నేపథ్యంలో ఆదివారం అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లాలోని పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. నిబంధనలు అమలులో ఉండడంతో గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10, 428 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మరోవైపు ఆయా కేంద్రాల వద్ద అభ్యర్థుల కోసం అన్ని మౌలిక వసతులతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

సంబంధిత పోస్ట్