ప్రభుత్వం నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఖుర్షిద్ నగర్ కు చెందిన షేక్ సమీ, ఇమ్రాన్ ఖాన్, మోహిసీన్ లు స్థానిక అస్లాం ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తరలిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న టూ టౌన్ సిఐ అశోక్ వారిని తనిఖీ చేసి గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2, 300 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.