అతి వేగం ప్రమాదాలకు కారణం: ఎస్పీ

64చూసినవారు
రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. గుడిహత్నూర్ మండలం మేకల గండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన స్థలాన్ని ఎస్పీ మంగళవారం పరిశీలించారు. వాహనదారులు జాతీయ రహదారిపై అతివేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఘటన వివరాలను డీఎస్పీ నాగేందర్ ను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్