ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏండ్ల నుంచి చేస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుకున్నారు. గురువారం ఆదిలాబాద్ లోని కలెక్టర్ చౌరస్తాలో టపాసులు కాల్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.