ఎస్సీ వర్గీకరణ అమలుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం హర్షనీయమని మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చందాల రాజన్న పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.