స్వతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు

79చూసినవారు
స్వతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు
దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే సుందరయ్య నగర్ 1వ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ రాధా ఆధ్వర్యంలో గురువారం చిన్నారులను స్వతంత్ర సమరయోధుల వేషధారణలో చక్కగా తయారు చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రభాతభేరి నిర్వహించి, జాతీయ జెండా ఎగురవేసారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్