చిన్నారుల గోరింటాకు సంబరాలు

67చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు గోరింటాకు సంబరాలు నిర్వహించుకున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ కార్యకర్త కే. రాధ ఆధ్వర్యంలో చిన్నారులంతా ఆనందంగా చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. అనంతరం తమ చేతులకు చూసుకుని మురిసిపోతూ చిందులేశారు. ఈ సందర్భంగా ఆటలు పాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్