సివిల్ సప్లై హమాలీల రేట్ల పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీల సమస్యలను పరిష్కరించాలని బుధవారం ఆదిలాబాద్‌లోని సివిల్ సప్లై గోదాం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.