సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈనెల 20న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఛలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు గణేష్, తదితరులున్నారు.