అబద్ధాలు మాట్లాడటంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని మాజీ మంత్రి , బీఆర్ఎస్ రైతు జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ అనడం సిగ్గుచేటు అన్నారు. రైతులను మోసం చేసిన సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.